శ్రీరంగం దేవాలయానికి స్వాగతం

Sri Ranganatha Swamy Temple, Srirangam

  • ప్రయాణం

ప్రయాణం

యాత్రా సమాచారం

  • రహదారి, రైలు, వైమానిక మార్గాల ద్వారా తిరుచిరాపల్లి చక్కగా అనుసంధానమై వుంది
  • శ్రీరంగం దేవాలయం తిరుచిరాపల్లి రైలు జంక్షన్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో వుంది
  • శ్రీరంగం దేవాలయం తిరుచిరాపల్లి విమాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో వుంది.
  • శ్రీరంగం దేవాలయం శ్రీరంగం రైలు స్టేషన్ కి 0.5 కిలోమీటర్ల దూరంలో వుంది.
  • ట్రిచ్చి రైల్వే స్టేషన్ / బస్ స్టాండ్ / ఎయిర్ పోర్టు ల వద్ద ‘రెంట్ ఎ కార్’ సౌకర్యం అందుబాటులో వుంది
  • తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ / సెట్రల్ బస్ స్టాప్ / ఛతిరం బస్ స్టాప్ ల నుంచి 24 / 7 బస్ సర్వీసులు (రూట్ నెం. 1) అందుబాటులో వుంటుంది..

తిరుచిరాపల్లి గురించి

తిరుచిరాపల్లి నాగరాజ చోళన్ కి, చాలా చారిత్రక దేవాలయాలకు, స్మారక చిహ్నాలకి, చర్చిలకి, మసీదులకి నిలయం. ఉరయూర్ (ఒరైయుర్ గా కూడా పలుకుతారు) అనే పాత త్రిచ్చికి చాలా సుదీర్ఘమైన సాంప్రదాయం వుంది. మనకు తెలిసి 2,500 ఏళ్ళ చరిత్రతో, తొలినాటి చోళులకి ఇది రాజధానిగా వుండేది. ఉరైయుర్ కి 10 కిలోమీటర్ల దూరంలో కరికాల చోళన్ అతిపాత మానవ నిర్మిత ఆనకట్ట కల్లనై నిర్మించేరు. తరవాత కాలంలో వచ్చిన చోళులకి, నాయక్ లకి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తొలినాళ్ళలోనూ అది చాలా ముఖ్యమైన పట్టణంగా వర్థిల్లింది. మధురై నాయక్ పాలకులు వారి రాజధానిని మధురై నుంచి తిరుచిరాపల్లికి, మళ్ళీ వెనక్కి చాలాసార్లు మార్చేరు. బ్రిటిష్ వారి ఈస్టిండియా కంపెనీ తిరుచిరాపల్లిని జయించడం బ్రిటిష్ వారు భారతదేశాన్ని జయించడంలో చాలా ముఖ్య దశ.

తిరుచిరాపల్లిలో ప్రసిద్ధ ప్రదేశం రాక్ ఫోర్ట్, 83 మీటర్ల ఎత్తున నిలిచే మహా కట్టడం, దాదాపు అంతా చదునుగా వుండే ఈ పట్టణంలో ఇది ఒక్కటే అంత ఎత్తన ఠీవిగా నిలబడుంటుంది. ఈ కారణంగానే దీన్ని రాక్ సిటీ అనికూడా పిలుస్తుంటారు. ఆ రాతి కొండ మీద ఉచ్ఛి పిళ్ళయార్ దేవాలయం వుంటుంది. ఇది భారతీయ దేవుడు వినాయకుడు (గణేశుడు) కోవెల, ఇక్కడ నుంచి ఎవరైనా యావత్ తిరుచిరాపల్లినీ మొత్తంగా చూడగలుగుతారు. నాయక్ లు కొద్దికాలంపాటు ఈ దేవాలయాన్ని సైనిక కోటగా కూడా ఉపయోగించుకున్నారు. పల్లవుల కాలంలో ఈ రాతికి దక్షిణ ముఖంలో పలు సుందరంగా తొలిచిన గుహ దేవాలయాలు ఏర్పడ్డాయి. శక్తివంతుడైన గణేశుడు ప్రధాన దేవునిగా తూర్పు పక్కన శ్రీ నండ్రుదయన్ వినాయకర్ ఆలయం వుంది. చాలా పెద్ద పరిమాణంలో గణేశుని ప్రతిమ, అరుదైన ఇతర దేవుళ్ళ విగ్రహాలు ఈ దేవాలయంలో చూడొచ్చు, ప్రతి ఏటా వినాయక చతుర్థి (వినాయకుని పుట్టినరోజు) సమయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ ప్రసిద్ధ దేవాలయంలో గత 70 ఏళ్ళుగా పలు కర్నాటక సంగీత విద్వాసులు కచేరీలు చేసేరు. ఈ రాతి దేవాలయం చుట్టూ ఛాత్రంగా ప్రసిద్ధికెక్కిన తీరికలేనంత వ్యాపార ప్రాంతం విస్తరించి వుంటుంది.

thar1
thar2