శ్రీరంగం దేవాలయానికి స్వాగతం

Sri Ranganatha Swamy Temple, Srirangam

  • పండుగలు

జ్యేష్టాభిషేకం

పేరుకుపోయిన మలినాల్ని తొలగించడం కోసం తమిళ మాసమైన అని (జూన్-జులై)లో ఈ ఉత్సవం చేస్తారు. ఆ రోజున, ఆలయ గర్భగుడిని శుభ్రపరచి, ఆలయంలో ప్రత్యేకంగా తయారుచేసిన మూలికా తైలాన్ని పెరియ పెరుమాళ్‌కు పూస్తారు. నామ్‌పెరుమాళ్, అమ్మవార్ల బంగారు తొడుగులకు (తమిళంలో కవచం లేదా అంగిల్) స్వర్ణకారులు మెరుగు పెడతారు. అనేకమంది అర్చకులు, భక్తులు బంగారు, వెండి కలశాల్లో పవిత్ర జలాల్ని తీసుకువచ్చేందుకు కావేరీ నదికి వెళ్తారు. బంగారు కలశాల్ని ఏనుగు మీద తీసుకొస్తారు. ఈ బంగారు కలశాన్ని 1734లో విజయనగర చొక్క నాయకర్ బహూకరించారు. ఆ తరువాతి కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తుకెళ్ళారు, కానీ భగవంతుడి కృపవల్ల అది తిరిగి స్వాధీనమయింది. ఈ శాసనం ఆ బంగారు కలశం మీద తెలుగుభాషలో చెక్కించి ఉంది. మరిన్ని వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి, ఆలయానికి తీసుకొస్తారు. కావేరి నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్ఛారణలు హోరెత్తుతాయి. ఆ తరువాత పాత్రలను పశ్చిమం వైపు ఉంచుతారు, విగ్రహాలన్నిటినీ “తిరువెన్నయలి ప్రాకారం’లో ఉంచుతారు. విగ్రహాలనుంచి బంగారు తొడుగుల్ని తొలగించి, జియ్యర్ స్వామీజీ, వధుల దేశికార్ స్వామిలకు అప్పగిస్తారు. ఆ తరువాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగు పెడతారు. భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు.

1

పవిత్రోత్సవం

అనుదిన పూజాదికాల్లో దోషాలను తొలగించేందుకు పవిత్ర యజ్ఞోపవీతాన్ని స్వామివారికి అలంకరించేందుకు తమిళ మాసమైన అని (ఆగస్ట్- సెప్టెంబర్)లో ప్రత్యేకంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మొదటి రోజున ఉత్సవ విగ్రహానికి యాగశాలలో 365 సార్లు తిరువర్ధనం నిర్వహిస్తారు, రెండో రోజున గర్భగుడిలోని దేవతామూర్తులందరికోసం 1008 సార్లు తిరువర్ధనం జరుపుతారు, బూకాండీ సేవై (అంగోబంగసేవ) పేరిట పవిత్ర యజ్ఞోపవీతాన్ని పూర్తిగా చూడతారు. స్వామివారికీ నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఉద్దేశించిన ఉత్సవం ఇది. ఈ ఉత్సవాన్ని చరనై వెంద్రన్ మండపం లేదా పవిత్ర మండపంలో నిర్వహిస్తారు. ఈ మండపాన్ని జాదవర్మ సుందరపాండ్యన్ నిర్మించారు. ముస్లింల ముట్టడి తరువాత, 60 ఏళ్ళ అనంతరం 1371లో స్వామివారు, దేవేరులు తిరిగి ప్రవేశించారు. గర్భగుడిలో అమ్మవార్లను మండపం పైభాగాన ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవాన్ని మొట్టమొదట బ్రహ్మ ఆరంభించారు. ఈ ఉత్సవం సందర్భంగా అందరు దేవతామూర్తులకూ పవిత్రమైన నూలు దారాల దండను (పవిత్రం) అలంకరిస్తారు.

శ్రీ జయంతి

శ్రీకృష్ణుని జయంతిని శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్ని కృష్ణ దేవాలయాల్లోనూ నిర్వహిస్తారు. ప్రత్యేకించి, కిలి మండప కృష్ణ ఆలయంలో దీన్ని వేడుకగా జరుపుతారు. ఇక్కడ కృష్ణుని విగ్రహం తన తల్లితండ్రులతో కనిపిస్తుంది. తండ్రి నందగోపన్, తల్లి యశోద, రోహిణి విగ్రహాల్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. పవిత్ర జలాన్ని చల్లుతారు. నాలుగు ఛితరై వీధుల్లో కృష్ణుడూ, నామ్‌పెరుమాళ్ ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఉత్సవం సందర్భంగా శ్రీ పండరాన్ని నామ్‌పెరుమాళ్ సందర్శిస్తారు. నామ్‌పెరుమాళ్‌కు వారి తిరుమంజనం నిర్వహిస్తారు.

ఊంజల్

ఊయల సేవ సమయంలో సంభవించే అవకాశం ఉన్న దోషాలను తొలగించడం కోసం తమిళ మాసమైన ఐపసి (అక్టోబర్- డిసెంబర్)లో దీన్ని నిర్వహిస్తారు. దీన్ని డోలోత్సవంగా పిలుస్తారు. ఈ వేడుకనే 1489లో కందాళై రామానుజర్ ఆరంభించారు. ఇప్పుడు దీన్ని తొమ్మిది రోజుల ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. ఒకటో రోజు నుంచీ ఏడో రోజు వరకూ దేవేరులతో కలిసి స్వామి ఊయలను అధిష్టిస్తారు, మిగిలిన రోజుల్లో స్వామివారొక్కరే ఊయల ఊగుతారు. స్వామివారి సన్నిధిలో ప్రతిరోజూ ఆర్యర్ కీర్తనలు పాడుతారు. చివరిరోజున స్వామివారు చంద్రపుష్కరణికి వేంచేస్తారు, అక్కడ తీర్థవరి నిర్వహిస్తారు. ఆ తరువాత నామ్‌పెరుమాళ్ ఊంజల్ మండపానికి వస్తారు, అక్కడ తిరుమంజనం జరుగుతుంది. అనంతరం రాత్రి తిరిగి గర్భగుడికి వస్తారు. ఐపసి మాసం కృష్ణపక్ష ఏకాదశికి ఎనిమిదిరోజుల ముందు ఊంజల్ ఉత్సవం మొదలవుతుంది. ఏకాదశి రోజున ఆఖరి రోజు ఉత్సవం జరుగుతుంది.

కైశిక ఏకాదశి

ఏకాదశికి ముప్ఫై రోజుల ముందు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామివారు సంతాన మండపానికి వేంచేస్తారు, అక్కడ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం తిరిగి గర్భగుడికి వెళ్తారు. మళ్ళీ రాత్రి స్వామి అర్జున మండపానికి వస్తారు. అక్కడ 365 పూజలు జరుగుతాయి. స్వామివారికి 365 దుస్తులు అలంకరిస్తారు. అర్థరాత్రి కైశిక పురాణాన్ని చదువుతారు. ఆలయానికి చేరుకునేప్పుడు పచ్చ కర్పూరం (శుద్ధిచేసిన కర్పూరం) చల్లుతారు, ఆ తరువాత గర్భగుడిలోకి ప్రవేశిస్తారు.

ఏకాదశి

తమిళ మాసం మార్గళి (డిసెంబర్-జనవరి)లో మొత్తం ఇరవై ఒక్క రోజులపాటు ఉత్సాహంగా, ఆడంబరంగా నిర్వహించే అత్యంత ముఖ్యమైన పండగ ఇది, దీన్ని పగల్ పట్టు, రా పట్టు అనే రెండు పదిరోజుల వేడుకగా విభజించారు. ఏకాదశి రోజున, రంగనాథస్వామి అద్భుతమైన వస్త్రాలను ధరించి, భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ, విదేశాల నుంచీ తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు ఉల్లాసాన్నీ, ఆనందాన్నీ కలుగజేసేందుకు పరమపద వాసల్ మీదుగా ఓ వేయి స్తంభాల మందిరంలోని తిరుమామణి మండపానికి విచ్చేస్తారు. ఆలయంలో నిర్వహించే అన్ని ఉత్సవాలకూ ఇది పతాక స్థాయి సందర్భం, రోజులకెల్లా దివ్యమైన రోజు; శ్రీరంగనాధ స్వామి ఓ అచ్చమైన రాజాధిరాజుగా శ్రీ రంగరాజ స్వామి పేరిట కొలువు తీరుతారు. ప్రత్యేకంగా నిర్మించిన, ఉత్తమాభిరుచితో అలంకరించిన పందిరితో మరింత విస్తరించిన పెద్ద మందిరంలో ఆయన తన పవిత్రమైన దర్బారును నిర్వహిస్తారు, రోజంతా నాలాయిర దివ్యప్రబంధ పఠనం జరుగుతుంది, రాత్రి పొద్దుపోయేక మాత్రమే ఆయన తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తారు. తెల్లవారుజాము నుంచీ అర్థరాత్రి వరకూ ఇసకవేస్తే రాలనంత భక్తజన సందోహం నిరంతరం దర్శనం చేసుకుని కదుల్తూ ఉంటుంది. భక్త బృందాలు అఖండమైన భజనల్తో, రోజంతా ఉపవాసం చేసి, రాత్రంతా జాగారం చేసి, తాళాల ధ్వనులకు అనుగుణంగా గీతాలాపనలూ, నృత్యాలూ సాగిస్తారు. నిజంగానే ఇది భగవంతుడు కళ్ళ ముందు సాక్షాత్కరించే రోజు. వాస్తవానికి ఇది భూమి పై వెలసిన స్వర్గం!

విరుప్పన్ (చిత్తిరై తేర్)

వృత్తిపరమైన దోషాలను శుద్ధి చేయడానికి తమిళ మాసం పళ్గుని (మార్చి-ఏప్రిల్)లో నిర్వహించే మహోత్సవం ఇది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజుల్లో ఒకరైన విరూపన్న ఉడయార్ 1383లో చిత్తిరై ఉత్సవాన్ని ఆరంభించారు. ముస్లింల ముట్టడుల తరువాత, రంగనాథ స్వామిని గర్భగుడిలోకి 1371లో తిరిగి తీసుకువచ్చారు (వైకాసి మాసం 17వ రోజున). ఆ సమయంలో ఆలయం అత్యంత శిథిలమైన స్థితిలో ఉంది. 1377లో, విరూపన్నన్ మహారాజు ఆలయ పునరుద్ధరణ కోసం పదిహేడువేల బంగారు నాణేలని దానంగా ఇచ్చాడు. పునరుద్ధరణ తరువాత, 1383వ సంవత్సరంలో, 60 ఏళ్ళ అనంతరం చిత్తిరై ఉత్సవం మొదలయింది. ఆలయ సంక్షేమం కోసం 52 గ్రామాలను విరూపన్నన్ దానమిచ్చాడు. శ్రీరంగానికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు తరలి వచ్చి 1383లో చిత్తిరై ఉత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ ఉత్సవంలో ఎనిమిది, తొమ్మిదో రోజుల్ని గ్రామీణులు ఎక్కువగా నిర్వహించుకుంటూ ఉంటారు. తమ పొలాల నుంచి పెద్ద సంఖ్యలో పశువులనీ, ధాన్యాలనీ స్వామివారికి గ్రామీణులు సమర్పించుకుంటూంటారు. రేవతీ నక్షత్ర కూటమికి ఎనిమిదిరోజుల ముందు ఉత్సవం మొదలవుతుంది. ఆ రోజున చిత్తిరై రథోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు.

అంకురార్పణం (విత్తనాల్ని మొలకెత్తించడం)

విష్వక్సేనుడినీ (స్వామివారి సైన్యాధ్యక్షుడు), ఆంజనేయస్వామినీ కొందరు అర్చకులు తాయారు సన్నిధికి తీసుకువస్తారు. వారు వావిల చెట్టు ఇసుక కింద పూజలు నిర్వహిస్తారు, కొందరు అర్చకులు నదీ గర్భానికి వెళ్లి, “భూసూక్తం”తో ఇసుక తీసుకొస్తారు, రెండు ఇసుకలనూ తేమగా ఉండే గట్టు మీద మిశ్రమం చేసి, కుండల్లో ఉంచుతారు. విత్తనాలను ఆ కుండల్లో నాటుతారు, తర్వాత యాగశాలలో ఉంచుతారు. కొద్ది రోజుల్లోనే అవి మొలకెత్తుతాయి.

విశ్వక్షేనుడిని నాలుగు చిత్తిరై వీధుల్లోకీ తీసుకెళ్తారు. స్వామిని దర్శించడానికి ముందు మొత్తం నాలుగు వీధుల్నీ ఆయన తనిఖీ చేస్తారు. ఈ తనిఖీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చూసేందుకు ఉద్దేశించినది. దీన్ని నగర శోథనై అంటారు.

మొదటిరోజు (ధ్వజారోహణం)

మొదటి రోజు తెల్లవారుజామున నాలుగు చిత్తిరై వీధుల్లోకీ ధ్వజాన్ని (కాన్వాస్ వస్త్రం మీద చిత్రీకరించిన గరుక్మంతుడి చిత్రం) తీసుకొస్తారు. తర్వాత, ఆలయంలో ఉత్సవం జరుగుతోందనడానికి సంకేతంగా స్వామివారి సమక్షంలో దాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం తరువాత స్వామివారిని అద్దాల మందిరంలోకి తీసుకొస్తారు (ఉత్సవంలోని మొదటి, ఏడురోజుల్లో మాత్రమే భక్తులు పూజించేందుకు అనుమతిస్తారు). సాయంత్రం ఉభయనాంచారులతో పాటుగా స్వామివారిని చిత్తిరై వీధుల్లోకి తీసుకొస్తారు. స్వామి సమక్షంలో పొయ్‌గైఅళ్వార్ కీర్తనలు ఆలపిస్తారు.

రెండవరోజు

ఉదయం నాలుగు చిత్తిరై వీధుల్లోకి పల్లకీలో నామ్‌పెరుమాళ్‌ను తీసుకొస్తారు. అదే రోజు సాయంత్రం నాలుగు చిత్తిరై వీధుల్లోకి కర్పగవృక్షం (కోరికలు తీర్చే చెట్టు-కల్పవృక్షం) వాహనం మీద నామ్‌పెరుమాళ్ తరలివస్తారు. స్వామిసమక్షంలో బూధతల్వార్ కీర్తనలు పాడుతారు.

మూడవ రోజు

ఉదయం సింహ వనాహనం మీద, సాయంత్రం యాలి (ఊహాత్మక జంతువు) వాహనం మీదా ఊరేగింపు నిర్వహిస్తారు. స్వామి సమక్షంలో పెయళ్వార్ కీర్తనలు పాడుతారు.

నాలుగో రోజు

ఉదయం నామ్‌పెరుమాళ్‌ను జంట ప్రభ వాహనం మీదా, సాయంత్రం గరుడ వాహనం మీదా ఊరేగిస్తారు. స్వామి సమక్షంలో తిరుమళిసయళ్వార్ కీర్తనలు ఆలపిస్తారు.

అయిదో రోజు

ఉదయం సర్ప వాహనం (శేష వాహనం) మీదా, సాయంత్రం హనుమంత వాహనం మీదా నామ్‌పెరుమాళ్ ఊరేగింపు జరుగుతుంది. స్వామి సమక్షంలో నమ్మాళ్వార్ కీర్తనలను ఆలపిస్తారు.

ఆరవ రోజు

ఉదయం నామ్‌పెరుమాళ్‌ను హంస (హంస పిల్ల) వాహనం మీద తీసుకొస్తారు, సాయంత్రం నారికేళ జల నివేదన అనంతరం స్వామివారిని ఐరావత వాహనం మీద ఊరేగిస్తారు. స్వామి సమక్షంలో నమ్మాళ్వార్ కీర్తనలు ఆలపిస్తారు.

ఏడవ రోజు

భక్తులను ఉదయం అద్దాల మందిరంలో సేవలకు అనుమతిస్తారు. సాయంత్రం దేవేరులతో కలిసి తిరుకొట్టారాన్ని (ధాన్యపు కొట్టు) నామ్‌పెరుమాళ్ దర్శించి, సంప్రదాయానుసారమైన ఆచారం ప్రకారం ధాన్యపు కుప్పల్ని పరిశీలిస్తారు. ఆ తరువాత స్వామివారు చిత్ర వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి తాయార్ సన్నిధి చేరుకుంటారు, అక్కడ తిరుమంజనం జరుగుతుంది. ఆ తరువాత, అర్థరాత్రి అద్దాల మందిరానికి చేరుకుంటారు. స్వామివారి సమక్షంలో తిరుమళిసయళ్వార్ కీర్తనలు ఆలపిస్తారు.

ఎనిమిదో రోజు

వెండి అశ్వ వాహనం మీద ఉదయం స్వామివారు వేంచేస్తారు. సాయంత్రం స్వర్ణ అశ్వ వాహనం మీద వస్తారు. చిత్ర రథ శాల దగ్గరకి అది వచ్చేసరికి, ఓ అద్వితీయమైన ఘట్టం సాక్షాత్కరిస్తుంది, నామ్‌పెరుమాళ్ స్వామి గుర్రం మీద కూర్చుని వేగంగా దౌడు తీయిస్తారు. స్వామి సమక్షంలో తిరుమంగైఅళ్వార్ కీర్తనలు పాడుతారు.

ఆరవ రోజు (రథ యాత్ర)

తెల్లవారుజామున నామ్‌పెరుమాళ్‌ను చిత్ర రథం మీద ఆసీనుల్ని చేస్తారు, రథాన్ని నాలుగు చిత్ర వీధుల్లో లాక్కువెళ్తారు. ఆ తర్వాత స్వామివారిని రేవతీ మండపంలోకి తీసుకొస్తారు, అక్కడ తిరుమంజనం జరుగుతుంది. స్వామి సమక్షంలో తిరుమంగైఅళ్వార్ కీర్తననల్ని ఆలపిస్తారు.

పదవ రోజు (శబ్దావరణం)

ఉదయం శంతను మండపంలో స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం నామ్‌పెరుమాళ్ ఊరేగింపు అత్యంత నిశ్శబ్దంగా (ఓ స్పష్టమైన కారణం కోసం సంగీత వాయిద్యాల వినియోగాన్ని మానేస్తారు) నిర్వహిస్తారు, స్వామివారు రామానుజుల కీర్తనలు వింటారు. రామానుజ ఆలయాన్ని నామ్‌పెరుమాళ్ సందర్శిస్తారు, అక్కడ రామానుజులు సాదరంగా ఆహ్వానిస్తారు. నామ్‌పెరుమాళ్‌కు కొబ్బరి నీటిని రామానుజులు అందజేస్తారు. నామ్‌పెరుమాళ్ స్వీకరించిన తర్వాత దాన్ని రామానుజులకు అందజేస్తారు.

పదకొండవ రోజు

ఉదయం గరుడ మండపంలో స్వామివారికి తిరుమంజనం జరుగుతుంది. సాయంత్రం పూర్తిగా పూలతో అలంకరించిన పల్లకీలో నామ్‌పెరుమాళ్ స్వామిని ఆసీనుల్ని చేసి చిత్ర వీధుల్లో తిప్పుతారు.

స్వామి ఆశీస్సులు కేవలం మానవులకే కాదనీ, జంతువులకు కూడాననీ ఈ ఉత్సవం చాటిచెబుతుంది. గజేంద్రుడనే పేరున్న ఏనుగు ప్రతిరోజూ ఓ కొలనులోంచీ పూలను తీసుకొచ్చి, ఏ విధమైన కోరికలూ కోరకుండానే స్వామివారి పాదపద్మాలకు వాటిని సమర్పించేది. ఈ సేవ అంటే ఆ ఏనుగుకి ఎంతో ఇష్టం. కనుక దేవుడి నుంచీ అది దేన్నీ కోరేది కాదు. ఆ ఏనుగంటే విష్ణుమూర్తికి ఎంతో అభిమానం. ఓ రోజున ఆ ఏనుగు పూలు కోస్తూండగా దురదృష్టవశాత్తూ దాని

కాలుని ఓ మొసలి గట్టిగా పట్టుకుంది. నిరంతరాయంగా దేవుని సేవ కొనసాగించేందుకు సాయంచేయమని స్వామిని అది వేడుకుంది, కానీ నొప్పినుంచీ, వేదన నుంచీ తనకు విముక్తి ప్రసాదించాలని అది స్వామిని కోరలేదు. స్వామి ఆ ప్రదేశానికి వచ్చి, మొసలిని వధించి, ఏనుగును ఆశీర్వదించారు. ఈ సంఘటనకు జ్ఞాపకంగా పవిత్ర కావేరీ నదీ గర్భంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారిని ఆరాధించేటప్పుడు ఉపయోగించే పూలలోని మలినాల్ని శుభ్రపరచేందుకు తమిళ నెల చిత్తిరై (ఏప్రిల్-మే)లో ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

అలాగే ఈ ఉత్సవాన్ని శ్రీ రామావతార స్మారకంగా కూడా నిర్వహిస్తున్నప్పటికీ, శ్రీరంగంలో దీన్ని ప్రముఖంగా జరుపుతారు. ఆళ్వారుల్లో ఒకరు, శ్రీరామ భక్తుడు కులశేఖరాళ్వార్ తన కుమార్తెను రంగనాథస్వామికి ఇచ్చి వివాహం చేశారు. ఆ ఉత్సవాన్ని అర్జున మండపంలో నిర్వహిస్తారు. రంగనాథస్వామి, చెరకులవల్లీనాంచార్ (కులశేఖరాళ్వార్ కుమార్తె) దగ్గరగా ఆసీనులవుతారు, వారికి తిరుమంజనం నిర్వహిస్తారు.

తమిళనెల వైకాసి (మే-జూన్)లో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన అన్నప్ప ఉడయార్ అనే రాజు 1444లో వసంత మండపం నిర్మించారు. వసంతం ఉత్సవాలను నిర్వహించడం కోసం మల్లిదేవన్ పుత్తూర్ గ్రామాన్ని దానంగా ఇచ్చారు. పున్నమికి ఎనిమిది రోజుల ముందు వసంతం ఉత్సవం మొదలవుతుంది. పున్నమిరోజున ఉత్సవం ముగుస్తుంది, అప్పుడు స్వామివారు అశ్వవాహనం మీద చిత్ర వీధుల్లో ఊరేగి, ఆ తర్వాత వసంత మండపానికి వస్తారు. వసంత మండపంలో తిరుమంజనం నిర్వహిస్తారు. ఉత్సవాల్లోని ఏడో రోజున ఇరువురు దేవేరులతో కలిసి స్వామి వసంత మండపాన్ని దర్శిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామి ఒక్కరే వసంత మండపానికి వస్తారు. ప్రతిరోజూ స్వామి గర్భగుడిలోకి తిరిగి వచ్చేటప్పుడు కంబర్ మండపాన్ని సందర్శిస్తారు. ప్రతిరోజూ స్వామి సమక్షంలో ఆళ్వారుల కీర్తనల్ని ఆలపిస్తారు. రంగనాయకి అమ్మవారి ఆలయంలో కూడా వసంతోత్సవాలు నిర్వహిస్తారు.

2
worship1
4
1st
2nd
3rd
4th
5th
6th
8th
10th