శ్రీరంగం దేవాలయానికి స్వాగతం

Sri Ranganatha Swamy Temple, Srirangam

 • Terms and Conditions

ఇ-విరాళాలు/ఆన్‌లైన్ కానుకల సేవలకోసం srirangam.orgని వినియోగించుకున్నప్పుడు, ఈ క్రింద పేర్కొన్న నియమాలు, నిబంధనలను శ్రీరంగంలోని శ్రీ రంగనాథర్ స్వామి ఆలయం (ఆలయం), మీరు (యూజర్) ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నియమ, నిబంధనల్లో ఏ సమయంలోనైనా కొత్తవి చేర్చే, పాతవాటిని తొలగించే, మార్చే లేదా సరిదిద్దే హక్కు ఆలయానికి దఖలుపడి ఉంది. కాబట్టి ఆలయం తాలూకు ఇ-విరాళాలు/ ఆన్‌లైన్ కానుకల సేవల్ని యూజర్ వినియోగించుకునే ప్రతిసారీ అతను/ఆమె ఈ నియమాలు, నిబంధనల్ని జాగ్రత్తగా చదవాల్సిందిగా సూచిస్తున్నాం.

Srirangam.org ఇ-పూజ, ఇ-విరాళాల్లో ప్రదర్శితమైన అన్ని ఉత్పత్తులు/సేవలు, సమాచారం ఓ “కానుకలకు ఆహ్వానించడం” మాత్రమే. విరాళాన్ని అందజేసేందుకు మీరు ఆర్డర్ చేసినప్పుడు/ మీ కానుకలను ఆమోదించేక్రమంలో “కానుక’ రూపుదాలుస్తుంది, అది ఈ క్రింది జాబితాలో పేర్కొన్న నియమాలు, నిబంధనలకు లోబడి ఉండాలి. మీ కానుకలను ఆమోదించే లేదా తిరస్కరించే హక్కు ఆలయానికి (Srirangam.org) దఖలుపడి ఉంది. మీకూ, ఆలయానికీ మధ్య ఒప్పందం ఈ క్రింది నియమాలు, నిబంధనలకు లోబడి ఉంటుంది:-

 • అతను/ ఆమెకు కనీసం 18 (పద్ధెనిమిది) సంవత్సరాల వయసు ఉన్నదనీ లేదా తల్లితండ్రుల నుంచో లేదా న్యాయపరమైన సంరక్షకుని నుంచో అనుమతి పొందేరనీ యూజర్ ధ్రువీకరించాలి.
 • పూర్వ ప్రాతినిధ్యాలు, ఆమోదాలు లేదా ఒప్పందాలన్నిటినీ ఈ నియమాలు, నిబంధనలు రద్దు చేస్తాయి, ఎలాంటి ఉత్తర్వుద్వారా జారీ అయిన ఏ ఇతర నియమాలతో ఉన్న తేడాలైనా సరే చెల్లుటు కావు. ఆలయానికి సంబంధించిన ఇ-విరాళాలు/ ఆన్‌లైన్ కానుకల సేవలలను వినియోగించుకోవడం అంటే ఈ నియమాలు, నిబంధనలకు బద్ధులుగా ఉంటామని మీరు అంగీకరించినట్టే.
 • అన్ని ధరలూ, ప్రత్యేకంగా పేర్కొనని పక్షంలో, భారతీయ రూపాయిల్లోనే ఉంటాయి.
 • అన్ని ధరలూ, దేవుని సేవల లభ్యత అనేవి పూర్తిగా ఆలయం విచక్షణ మీద ఆధారపడి ముందస్తు సమాచారం లేకుండానే మారవచ్చు.
 • ధరను తప్పుగా పేర్కొన్న ఓ ఉత్పత్తి జాబితాలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఏ ఆర్డర్‌నైనా తిరస్కరించే లేదా రద్దు చేసే హక్కు ఆలయానికి రిజర్వ్ అయి ఉంది. ఆర్జర్ ధ్రువీకరణ జరిగినా/ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు జరిగినా కూడా సంబంధం లేదు. ఆలయం ద్వారా చెల్లింపును ప్రాసెస్ చేసిన సందర్భంలో, దాన్ని మీ క్రెడిట్ కార్డు ఖాతాలోకి తిరిగి జమ చేయడం జరుగుతుంది, ఆ విషయాన్ని మీకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తాం.
 •  క్రెడిట్ కార్డు లావాదేవీకి సంబంధించి, మీరు తప్పనిసరిగా మీ సొంత క్రెడిట్ కార్డునే ఉపయోగించాలి. ఎటువంటి క్రెడిట్ కార్డు మోసాలకూ ఆలయం బాధ్యత వహించదు. క్రెడిట్ కార్డు వినియోగం మోసపూరితంగా జరిగినట్టయితే, దానికి బాధ్యత యూజర్‌దే, “వేరే రకంగా జరిగిందని రుజువుచేసే” బాధ్యత పూర్తిగా యూజర్‌దే.
 • ఒకసారి సైట్‌లో ఆర్డర్ చేసిన తరువాత వాటిని రద్దు చేయాలనే ఏ విజ్ఞాపననైనా అనుమతించడం జరగదు.
 • మీ పొరపాటు వల్ల (తప్పుడు పేరు లేదా చిరునామా లాంటివి) ఆర్డర్ బట్వాడా జరగని పక్షంలో, తిరిగి బట్వాడా చేసేందుకు అయ్యే ఏ ఖర్చనైనా ఆర్డర్ చేసిన యూజర్ నుంచి ఆలయం వసూలు చేయడం జరుగుతుంది.
 •  వరదలు, అగ్నిప్రమాదాలు, యుద్ధాలూ, ఆకస్మిక విపత్తులూ లేదా ఆలయ నియంత్రణకు మించిన ఏ ఇతర కారణాలవల్లనైనా విరాళంలో ఆలస్యం/ బట్వాడా కాకపోవడం జరిగితే, దానికి ఆలయం బాధ్యత వహించదు.
 • ఆలయం, దాని సేవా ప్రొవైడర్లు, కన్సల్టెంట్లు, సంప్రతింపు కంపెనీల ద్వారా అందే సేవలను న్యాయపరమైన ప్రయోజనాలకు మాత్రమే వినియోగించుకునేందుకు యూజర్ అంగీకరించాలి.
 • ప్రామాణికమైన, యదార్ధమైన సమాచారం అందించేందుకు యూజర్ అంగీకరించాలి. యూజర్ అందించిన సమాచారాన్నీ, ఇతర వివరాలనూ ఏ సమయంలోనైనా ధ్రువీకరించుకునే, ప్రామాణీకరించుకునే హక్కు ఆలయానికి దఖలుపడి ఉంది. ఒకవేళ యూజర్ వివరాలు సరైనవి కావని (పూర్తిగానైనా, పాక్షికంగానైనా) రుజువైనట్టయితే, రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించేందుకూ, Srirangam.org. E-Pooja, E-Donation లేదా ఇతర ఆన్‌లైన్ కానుకల సౌకర్యాలనూ ఏ విధమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రద్దు చేసేందుకూ తన పూర్తి విచక్షణతో నిర్ణయం తీసుకునే హక్కు ఆలయానికి ఉంది.
 • ఈ సైట్ ద్వారా సేవలను వినియోగించుకునేటప్పుడు యూజర్లకు ఎదురయ్యే ఎలాంటి నష్టాలకూ ఆలయం బాధ్యత వహించదు. సేవలను అందించేవారిలో ఎవరి చర్యల ద్వారానైనా/ వదిలేయడం ద్వారానైనా జరిగే జాప్యాలవల్ల ఆదాయానికీ/ డాటాకూ సంభవించే నష్టాలూ, బట్వాడా కాకపోవడాలూ, బట్వాడా అందకపోవడాలూ లేదా సేవల్లో అంతరాయాలూ ఏర్పడడంతో సహా దీనికి ఎలాంటి పరిమితీ లేదు. కార్యనిర్వహణ, ప్రసారాల్లో జాప్యం, కంప్యూటర్ వైరస్, సమాచార లైన్ల వైఫల్యం లేదా విధ్వంసం లేదా అనధికారికంగా చొరబడడం, రికార్డుల దిద్దుబాటు లేదా వినియోగం, ఒప్పంద ఉల్లంఘన, నీతిబాహ్యమైన ప్రవర్తన, నిర్లక్ష్యం లేదా ఏ ఇతర చర్య కారణం వల్లనైనా పనితీరు, తప్పు, వదిలేయడం, అంతరాయం, తొలగింపు, లోపం, జాప్యాలతో సంభవించే ఏ నష్టాలు లేదా గాయాలకైనా కూడా ఈ గమనిక జవాబుదారీ వర్తిస్తుంది.
 • Srirangam.org e-Pooja , e-Donation /online offering సేవ(లు) తన పూర్తి రిస్క్ తో వినియోగించుకుంటున్నానని యూజర్ అంగీకారం తెలపాలి. Srirangam.org e-Pooja , e-Donationవ్యవస్థ సేవ(లు)ను ఏ రకమైన వారెంటీలనూ, అవి వ్యక్తీకరించినవైనా, సూచించినవైనా “యథాతథ” ప్రాతిపదికన అందజేస్తాయి. తాను అందజేసిన లేదా సేవలను ఉపయోగించుకోవడం వల్ల సమకూరగల ఫలితాలకూ, ఈ సేవ ద్వారా అందించే ఎలాంటి సమాచారం, సేవ, లేదా వస్తువులకు సంబంధించిన ఖచ్చితత్వం, విశ్వసనీయతలకూ వ్యక్తీకరించినవైనా, సూచించినవైనా ఎలాంటి వారెంటీలనూ తన సర్వీస్ ప్రొవైడర్లకూ, ఉద్యోగులకూ, ఏజెంట్లకూ, కన్సల్టెంట్లకూ, కాంట్రాక్టెడ్ కంపెనీలకూ ఆలయం ఇవ్వదు. సమాచార గోప్యతను నిర్వహించే ప్రాతినిధ్యం కానీ, అధికారం కానీ ఆలయానికి లేదు; అయితే అలాంటి గోప్యతను నిర్వహించేందుకు సాధ్యమయ్యే ప్రయత్నాలను వినియోగించుకునేందుకు ఆలయం ప్రస్తుతం ప్రయత్నాలు సాగిస్తోంది.
 • వర్తించగల భారత చట్టాలకు అనుగుణంగా ఈ ఒప్పందం రూపొందింది. ఈ ఒప్పందం విషయంలో తలెత్తే ఎలాంటి విచారణలైనా తిరుచ్చీలోని న్యాయస్థానాల ప్రత్యేక పరిధిలోకి వస్తాయి.